KESARIYA TERA TELUGU LYRICS KUKUMALA LYRICS IN TELUGU
పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది
నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏదిఆ బ్రహ్మే నిను చెయ్యడానికే
తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే
అందాల నీ కంటి కాటుకతో
రాసే ఉంటాడే నా నుదిటి రాతలనే
కుంకుమలా నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షానయ్యా వేడుకలాగా
మౌనంగా మనసే మీటే
మధురాల వీణవు నువ్వే
ప్రతి ఋతువుల పూలే పూసే
అరుదైన కొమ్మవు నువ్వే
బ్రతుకంతా చీకటి చిందే
అమావాసై నేనే ఉంటే
కలిశావే కలిగించావే దీపావళి కలనే
జాబిల్లే నీ వెనకే నడిచేనే టెన్ టు ఫైవ్
నీ వెన్నెలనడిగేనే నీ వన్నెలనడిగేనే
అందాల నీ కంటి కాటుకతో పైవాడే
రాసే నా నుదిటి రాతలనే
కుంకుమలా నువ్వే చేరగా ప్రియా
కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ
వేకువలా నువ్వే చూడగా ప్రియా
వెండి వర్షానయ్యా వేడుకలాగా
పమగమ గసరీగా పా పమగమ గసరీగా
గసనీగా దనిమాగ దనిపమగా మా
Comments
Post a Comment